ఆస్తుల రిజిస్ట్రేషన్‌లలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించింది. అనంతరం ప్రశాంత్‌రెడ్డి మంత్రులతో కలసి విలేకరులతో మాట్లాడారు. గురువారం వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై సంబంధిత వర్గాలతో ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో అన్ని అంశాలను చర్చించి సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు. అధికారులు, నిర్మాణరంగ సంస్థల ప్రతినిధులతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామన్నారు.
చట్టపరమైన విషయాలు, చట్టాల్లో ఏమైనా సవరణలు తీసుకురావాలా? అనే అంశాలపై ఒక బృందం; సాంకేతిక అంశాలపై మరో బృందం పనిచేస్తుందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్న విధానం, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పరిస్థితులు, సిబ్బంది నిర్వహణ అంశాలపై మూడో బృందం పనిచేస్తుందన్నారు. ఈ బృందాల్లో క్రెడాయ్, నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులనూ భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్‌లు, ఎల్‌ఆర్‌ఎస్‌లేని వాటిని అమ్ముకోవడంపై ఒకటిరెండు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
మార్టిగేజ్ సేవలు తొందర్లోనే
అపార్ట్‌మెంట్లలో డెవలప్‌మెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ(డీజీపీఏ) రిజిస్ట్రేషన్‌లకు ప్రస్తుతం అవకాశం లేదని 48 గంటల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. ‘‘జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ), సేల్స్ అండ్ పర్చేజ్ అగ్రిమెంట్(ఎస్పీఏ) రిజిస్ట్రేషన్లు కూడా లేవు. అవి కూడా తొందర్లోనే ఉంటాయి. మార్టిగేజ్, మార్టిగేజ్ రిలీజ్ డీడ్ వంటి కొన్ని సేవల్ని వెంటనే పెట్టలేకపోయాం. వాటికి కూడా తొందరలోనే అవకాశం కల్పిస్తాం’’ అని మంత్రి వివరించారు. విక్రయదారులు, కొనుగోలుదారులు ఎంతమంది ఉన్నా రిజిస్ట్రేషన్‌లు చేసుకోవచ్చన్నారు.
డాక్యుమెంట్ తెచ్చుకోవచ్చు
ఇప్పుడు ఇస్తున్న రిజిస్టర్డ్ డాక్యుమెంట్ సాధారణ కాగితంలా ఉందని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నట్టు కొందరు పేర్కొన్నారని.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బ్యాంకర్లతో సమావేశమై వారి అపోహలను తొలగిస్తారని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వెబ్‌సైట్‌లో ఉన్న నమూనా డాక్యుమెంట్ ప్రకారమే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన పనిలేదన్నారు. కొనుగోలుదారులు ప్రత్యేకంగా డాక్యుమెంట్ రాసుకొని వెళ్తే దానిని కూడా రిజిస్టర్ చేసేలా మార్పులు చేశామన్నారు. కొనేవారు, అమ్మేవారు ఇష్టమైన రీతిలో డాక్యుమెంట్ రాసుకుని ప్రజంట్ చేయవచ్చని తెలిపారు. సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, కె.టి.రామారావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్; ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.
0 Comments