కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తుందని టీఆర్‌ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం తెలంగాణ ప్రజలకు తెలియాలి అంటూ ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి పన్నుల రూపంలో వసూలు చేసే మొత్తంతో పోలిస్తే.. తిరిగి రాష్ట్రానికి విడుదల చేసే మొత్తం తక్కువగా ఉందని అన్నారు. ఈ మేరకు లెక్కలతో కూడిన వివరాలను ఆయన విడుదల చేశారు.
భారత ఆర్థిక వృద్దిలో తెలంగాణ గొప్ప పాత్ర పోషిస్తుందని చెప్పారు. "2014 నుంచి మన రాష్ట్రం పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి 2,72,926 కోట్ల రూపాయల సహకారం అందించిందని.. అయితే కేంద్రం మాత్రం తెలంగాణకు 1,40,329 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఈ విషయం తెలంగాణ ప్రజలు కచ్చితంగా తెలుసుకోవాలి. తెలంగాణ భారతదేశాన్ని బలంగా చేసేందుకు తెలంగాణ ఒక పిల్లర్‌గా కొనసాగుతుంది" అని కేటీఆర్ పేర్కొన్నారు.
0 Comments