ధరణి పోర్టల్‌ నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీల వివరాల నమోదుపై హైకోర్టు స్టే

ధరణి పోర్టల్‌ నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీల వివరాల నమోదుపై హైకోర్టు స్టే


హైదరాబాద్: ధరణి పోర్టల్‌ నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీల వివరాల నమోదుపై హైకోర్టు స్టే విధించింది. ధరణి పోర్టల్‌లో భద్రతాపరమైన అంశాలపై దాఖలైన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ధరణిలో నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీ వివరాలు నమోదు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. భద్రతాపరమైన నిబంధనలు పాటించకపోతే ఇబ్బందులు వస్తాయని కోర్టు పేర్కొంది. ఫ్లేస్టోర్‌లో ధరణి పోర్టల్‌తో పోలిన మరో 4 యాప్స్‌ ఉన్నాయని హైకోర్టు వెల్లడించింది. అసలు యాప్‌ ఏదో తెలుసుకోవడం ఇబ్బందన్న హైకోర్టు వ్యాఖ్యానించింది. యాప్‌ భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలపాలని హైకోర్టు సూచించింది. రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది

Post a Comment

0 Comments