విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం


కళాశాలల్లో ఫీజులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్‌ ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ కళాశాలల్లో ట్యూషన్‌ ఫీజును 30శాతం తగ్గించి తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొన్నది. ట్యూషన్‌ ఫీజు 70శాతం మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను లెక్కజేయకుండా పూర్తి ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

Post a Comment

0 Comments