ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు నాంది పలికే ఎన్నికలు కావాలని కేంద్ర మంత్రి
కిషన్‌రెడ్డి అన్నారు. మిరదొడ్డి మండలం భూపల్లిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ఎన్నికల సభలో మాట్లాడుతూ, తెలంగాణా పోరాటంలో దుబ్బాక కీలకపాత్ర పోషించిందని అన్నారు. తెలంగాణా వస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని ధ్వజమెత్తారు. వేయి మంది కేసీఆర్‌లు ఉన్నా తెలంగాణ వచ్చేది కాదని, ఆనాడు పార్లమెంట్‌లో బిల్లు పెట్టినప్పుడు బీజేపీ మద్దతు తెలపడం ద్వారానే వచ్చిందన్నారు.
తెలంగాణ వచ్చిన యువకులకు ఉద్యోగాలు లేకుండాపోయాయన్నారు. కేసీఆర్ ఇచ్చిన అన్ని హామీలను తప్పారని, టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్పే అవకాశం దుబ్బాక ఉప ఎన్నిక ద్వారా వచ్చిందన్నారు. పంటల బీమా పథకం నరేంద్ర మోదీ తెచ్చారని,దీనిని తెలంగాణా ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదన్నారు కిషన్ రెడ్డి మండిపడ్డారు. హరీష్ రావు అన్నీ అబద్దాలాడుతున్నారని ,రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కేంద్రం ఇస్తున్న నిధులు ఏమి లేవనడాన్ని ప్రశ్నించండి అని కోరారు.
0 Comments