ఇకపై అక్రమ రిజిస్ట్రేషన్లకు తావులేదు.. ధరణి పోర్టల్ ప్రారంభించిన కేసీఆర్..

ఇకపై అక్రమ రిజిస్ట్రేషన్లకు తావులేదు.. ధరణి పోర్టల్ ప్రారంభించిన కేసీఆర్..



 రెవెన్యూ సేవలను సులభంగా అందించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా మూడచింతలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన ధరణి పోర్టల్‌ను లాంచ్ చేశారు. దీంతో నేటి నుంచి తెలంగాణలో ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, మంత్రి మ‌ల్లారెడ్డి, జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్లుతో పాటు ప‌లువురు నాయ‌కులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌లో అక్రమ రిజిస్ట్రషన్లకు తావు ఉండదని స్పష్టం చేశారు. తప్పు చేసే అధికారం ఎవరికీ లేదన్నారు. ధరణి పోర్టల్ దేశానికే ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందన్నారు. రైతుల భూములకు రక్షణ కల్పించేందుకు ధరణి పోర్టల్‌కు రూపకల్పన చేశామని వెల్లడించారు.

Post a Comment

0 Comments