దీనికోసం ఇప్పట్నుంచే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే కరోనా రోజురోజుకీ విజృంభిస్తున్న తరుణంలో ఇంకొన్ని రోజులు ఇంటి దగ్గరే ఉండాలని ఫిక్స్ అయిపోయారు దర్శక నిర్మాతలు. అయితే ఎప్పుడు షూటింగ్ మొదలు పెట్టినా కూడా నిర్మాత దానయ్యను మాత్రం ఓ సమస్య వెంటాడుతుంది. అది ఆయనకు బడ్జెట్ కూడా పెంచేస్తుంది. ఇప్పటికే ఆలస్యం కావడంతో కోట్లు నష్టపోయాడు దానయ్య. అందులోనూ ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ అదనపు ఖర్చులు కూడా ఈయనపై పడనున్నాయి.
ట్రిపుల్ ఆర్ షూటింగ్ కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ త్వరలోనే సిద్ధం కానున్నారు. రాజమౌళి కూడా అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే దసరా నుంచి మొదలు పెట్టినా.. అల్యూమీనియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్‌లోనే నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సెట్ లాక్‌డౌన్‌కు ముందు నిర్మించారు. దాదాపు 20 కోట్లతో ఈ సెట్ నిర్మించారు. అయితే ఆర్నెళ్లుగా వాడకపోవడంతో ఇది పూర్తిగా పాడైపోయిందని తెలుస్తుంది. దీన్ని బాగు చేయడానికి నిర్మాతకు మళ్లీ కొన్ని కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి.
0 Comments