అసెంబ్లీలో కేసీఆర్-ఒవైసీ మధ్య మాటల యుద్ధం..

అసెంబ్లీలో కేసీఆర్-ఒవైసీ మధ్య మాటల యుద్ధం..

కరోనా విషయంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రపక్షంపై సభలో ఎంఐఎం వ్యతిరేక గళం వినిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం జరిగిన సభలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కరోనాపై జరుగుతున్న చర్చలో భాగంగా ఓవైసీ, కేసీఆర్‌కు మధ్య మాటల యుద్ధం నడిచింది. అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగిస్తున్న సమయంలోనే ఆయన ప్రసంగాన్ని సీఎం కేసీఆర్ అడ్డుకొన్నారు. దీంతో ఒవైసీ అసహనానికి గురయ్యారు.


అసెంబ్లీలో బుధవారం ఎంఐఎం శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. కరోనా సమయంలో సేవ చేసిన కరోనా వారియర్స్‌కు తాము సెల్యూట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో ప్రభుత్వం సెల్యూట్ చెప్పకపోయినా తాము ఆ పని చేస్తామని అన్నారు. అసెంబ్లీలో కరోనాపై ప్రభుత్వ ప్రకటన హెల్త్ బులెటిన్ మాదిరిగా ఉందని అక్బరుద్దీన్ విమర్శించారు.

ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహాభారతం మొత్తం చెబుతున్నారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఈ సమయంలో కరోనా వారియర్స్‌కు ఇన్సెంటివ్ ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రమేనని ఆయన చెప్పారు. ఒవైసీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరి కాదని అన్నారు. ఆ తర్వాత ఓవైసీ మరోసారి మాట్లాడారు. తాను ప్రభుత్వాన్ని విమర్శించలేదని, ప్రభుత్వం చేసిన పని కూడా చెప్పుకోలేదని అన్నారు. తాను ప్రభుత్వాన్ని విమర్శించకపోయినా సీఎంకు తనపై ఎందుకు కోపం వస్తోందో తనకు తెలియడం లేదని అన్నారు.

Post a Comment

0 Comments