మత్స్యకారులు, పాల రైతుల కోసం ప్రధాని మోదీ రెండు కొత్త పథకాలు

మత్స్యకారులు, పాల రైతుల కోసం ప్రధాని మోదీ రెండు కొత్త పథకాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు రెండు కొత్త పథకాలను ప్రారంభించారు. మత్య్సకారుల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, పాల రైతుల కోసం ఈ-గోపాల యాప్‌ను ప్రారంభించారు. దేశంలో ఫిషరీస్‌ను అభివృద్ది చేయడానికి ఈ మత్య్ససంపద యోజన ఉపయోగపడనుంది. అలాగే, పాల రైతులకు మార్కెట్ కల్పించడం, సమాచారం అందించేందుకు ఈ-గోపాల యాప్ ఉపయోగపడనుంది. కరోనా వైరస్ సమయంలో ఆత్మనిర్భర్ భారత్ అంటూ పిలుపునిచ్చిన ప్రధానమంత్రి ఈ క్రమంలోనే కొత్త పథకాలను తీసుకొచ్చారు. 

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ‘మత్స్యకారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో దేశంలో చేపల ఉత్పత్తిని రెట్టింపు చేయాలనేది మా లక్ష్యం. ఫిషరీస్ శాఖకు బూస్ట్ ఇవ్వడానికి దోహదపడుతుంది.’ అని అన్నారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన అనేది శ్వేతవిప్లవం లాగా తీపి విప్లవానికి పునాది వేస్తుందన్నారు. అలాగే, దేశంలోని 21 రాష్ట్రాల్లో ఈ- గోపాల యాప్ ద్వారా పాల ఉత్పత్తిదారులకు లబ్ది చేకూరుతుందన్నారు.

Post a Comment

0 Comments