జయప్రకాశ్ రెడ్డి మృతి.. సినీ రాజ‌కీయ ప్ర‌ముఖుల సంతాపం..

జయప్రకాశ్ రెడ్డి మృతి.. సినీ రాజ‌కీయ ప్ర‌ముఖుల సంతాపం..

తెలుగు సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషించిన నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన బాత్రూములో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. కరోనా కారణంగా సినీమా షూటింగ్లపై ప్రభుత్వం నిషేధించడంతో ఆయన గుంటూరులోనే ఉంటున్నారు. వెంకటేష్, దాసరి కాంబినేషన్‌లో వచ్చిన బ్రహ్మ పుత్రుడుతో పరిచయమైన.. ప్రేమించుకుందా రా సినిమాతో ఎంతో పాపులర్ అయ్యారు జయప్రకాష్. ఆ సినిమాలో ఆయన నటన, డైలాగ్ తీరు ఎంతో ఆకట్టుకుంది. రాయలసీమ యాసలో జయ ప్రకాష్ మాట్లాడే తీరు మంత్ర ముగ్దుల్నీ చేస్తుంది. ఆ సినిమా తర్వాత జయ ప్రకాష్ చాలా సినిమాల్లో విలన్‌గా చేశాడు. భగవాన్, బావగారు బాగున్నారా లాంటీ సినిమాల్లో నటించినా.. బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సమర సింహా రెడ్డి సినిమాలో మరో సారి రాయలసీమ యాసలో మాట్లాడుతూ విలన్‌గా విశ్వరూపం చూపించాడు.  ఈ సినిమాలో ఆయన నటనకు నంది అవార్డ్ వచ్చింది. జయప్రకాశ్ రెడ్డి మృతి ప‌ట్ల సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు.

Post a Comment

0 Comments