కరోనా బాధితుల పట్ల వైద్యులు మానవత్వం చూపించాలని సీఎం జగన్ హితవు పలికారు. కోవిడ్ బాధితుడికి అర్ధ గంటలోపు బెడ్ ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. 104, 14410 కాల్ సెంటర్లకు వచ్చే ఫోన్ కాల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వరదలు, సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గోదావరి, కృష్ణా నదుల్లో వరదలు తగ్గుముఖం పడుతున్నాయని, సెప్టెంబర్ 7 లోపు పంట నష్టంపై అంచనాలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే గోదావరి వరద ముంపు బాధితులకు రూ. 2 వేలు అదనపు పరిహారం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలన్నారు.
0 Comments