(చట్టం -నిజామాబాద్) తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ తన జీవితాన్ని తెలంగాణ సమర్పించిన వ్యక్తి, తెలంగాణ ప్రజలను చైతన్య పరిచిన శక్తి హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. గురువారం నాడు నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో జరిగిన జయశంకర్ సార్ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శ్రీకృష్ణదేవరాయలకు మహామంత్రి తిమ్మరుసు లాగా, చంద్రగుప్తునికి చాణక్యుని లాగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను తెలంగాణ ప్రజలకు తిరుగులేని నాయకుడిగా నిలిపిన వ్యక్తి జయశంకర్ సార్ అని అన్నారు. తెలంగాణ ప్రజలుకు జరుగుతున్న అన్యాయాన్ని అనుక్షణం వ్యతిరేకించడమే గాక ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చైతన్య పరిచిన గొప్ప నిబద్ధత కలిగిన వ్యక్తి జయశంకర్ సార్ అని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ జయశంకర్ సార్ ఆచార్యునిగా యువతను ముందుకు నడిపించాలని స్వేచ్ఛా స్వాతంత్రాలు తెలంగాణ జాతి కి సాధించే విధంగా మార్గనిర్దేశం చేశారని అన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బట్టు శ్రీధర్ రాజు, తంగళ్ళపల్లి నరేష్, కేర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments