(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) సిద్దిపేటకు చెందిన కవి కాల్వ రాజయ్య మల్లినాథ సూరి కళాపీఠం తెలుగు కవివరా సాహిత్య వేదిక వారి " తెలుగు కవిరత్న" బిరుదుకు ఎంపికైనట్లు అద్యక్షులు అమరకుల లచ్చిరెడ్డి తెలిపారు. మల్లినాథ సూరి కళాపీఠం తెలుగు కవివరా సాహిత్య వేదికలో51 అంశాలపైన రచనలు చేసినందుకు ఈ బిరుదును ప్రకటించారు. కొహేడ మండలం గుండారెడ్డి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా పని చేస్తున్న రాజయ్య పద్యాలు, కవితలు, గేయాలు రాస్తూ విద్యార్థులతో రచనలు చేయిస్తూ బాల కవులను ప్రోత్సహిస్తున్నారు.
కాల్వ రాజయ్య బిరుదుకు ఎంపిక కావడం పట్ల సిద్దిపేట కవులు ఉండ్రాళ్ళ రాజేశం,వరుకోలు లక్ష్మయ్య, బస్వ రాజ్ కుమార్, కోణం పర్శరాములు, కమ్మరి శ్రీనివాసచారి, శాడ వీరారెడ్డి, గొర్రె రాజేందర్, ఆదిమూలం చిరంజీవి, తిరుపతి, రావిరాల బసవయ్య, గంగాపురం శ్రీనివాస్ తదితరులు అభినందనలు తెలిపారు.

0 Comments