హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాజెక్టుల కింద చేపడుతున్న నగర రోడ్ల నిర్మాణం, విస్తరణపై పురపాలక శాఖ మంత్రి తారక రామారావు ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ హాజరయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లో చేపడుతున్న SRDP పనులకు సంబంధించి మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం SRDP పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపిన అధికారులు త్వరలోనే మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న అవసరాలతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్ కి అనుగుణంగా రోడ్ల విస్తరణ మరియు రోడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కావాల్సిన మైక్రో ప్లానింగ్ పైన దృష్టిసారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
0 Comments