ప్రగతి భవన్‌కు సీఎం కేసీఆర్.. తర్వాతి సమీక్ష దీనిపైనే.

ప్రగతి భవన్‌కు సీఎం కేసీఆర్.. తర్వాతి సమీక్ష దీనిపైనే.


గత నెల చివర్లో జరిగిన మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి వేడుకల అనంతరం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించకుండా ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌‌లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ సీఎం అజ్ఞాతంపై ప్రతిపక్షాలతో సహా నెటిజన్లు సైతం విమర్శలు చేశారు. #WhereIsKCR హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. అంతేకాక, సామాజిక మాధ్యమాల్లో సీఎంకు సంబంధించిన ట్రోలింగ్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌కు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేసీఆర్ సుమారు రెండు వారాలుగా ఎర్రవల్లిలోని ఫాం హౌస్‌లో ఉన్నారు. ఆయన త్వరలో రైతులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.


Post a Comment

0 Comments