హైదరాబాద్: చిలుకూరు బాలాజీ ఆలయంలో ఆదివారం ఉదయం అద్భుతం జరిగింది. అర్చక స్వామి సురేష్ మహరాజ్ తెల్లవారుజామున గుడికి వచ్చారు. స్వామివారి సన్నిధిలో కూర్మ మూర్తి (తాబేలు) ఉండటాన్ని గమనించి ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌కు తెలిపారు. దీంతో ఆయన వచ్చి.. చూసి ఆశ్చర్యపోయారు. కూర్మ మూర్తి (తాబేలు) లోపలికి ప్రవేశించడానికి ఎలాంటి దారి లేదని, అయినా ఎలా వచ్చిందో అర్థం కావడంలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ కూర్మ మూర్తి (తాబేలు) ఆలయ ప్రవేశం ఒక దివ్యమైన సంకేతాన్ని సూచిస్తోందని రంగరాజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సాగర మథనంలో హాలాహలం వచ్చింది… దానిని పరమశివుడు స్వీకరించాడు. అలాగే కరోనా నుంచి మనకు తొందరగా విముక్తి లభించబోతోందని, మనకు అమృతం దొరకబోతోందని ఇదే సారాంశమని, ఇది అందరికీ శుభవార్త అని రంగరాజన్ వ్యాఖ్యానించారు.
0 Comments