ఇవాళ, రేపు సొంత జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ఇవాళ, రేపు సొంత జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి నేడు, రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు సీఎం నివాళులు అర్పించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు, అక్కడి నుండి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ కడప చేరుకోనున్నారు. సాయంత్రం 4.55 గంటలకు కడప ఎయిర్పోర్ట్ నుండి ఇడుపులపాయకు హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు. నేడు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఎస్టేట్స్‌లోని గెస్ట్ హౌస్‌లో సీఎం జగన్ బస చేయనున్నారు. 

Post a Comment

0 Comments