.13 వేల ఫైన్ కట్టిన ప్రధాని ఎవరంటే...మోదీ స్పీచ్‌లో హైలైట్ ఇదే...

.13 వేల ఫైన్ కట్టిన ప్రధాని ఎవరంటే...మోదీ స్పీచ్‌లో హైలైట్ ఇదే...

ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అన్ లాక్ 2.0, గరీబ్ కల్యాణ్ యోజన వంటి పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పీఎం మోదీ నిబంధనలు పాటించని వారిని హెచ్చరించారు. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పుడు ప్రజలందరూ నిబంధనలను పాటించారని ప్రధాని మోదీ అన్నారు. కానీ అన్‌లాక్ ప్రారంభమైన వెంటనే కొంతమంది అజాగ్రత్తగా ప్రవర్తిస్తున్నట్లు మోదీ గుర్తు చేశారు. ఇప్పుడు దేశ పౌరులందరూ మళ్లీ అదే అప్రమత్తతను చూపించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

నిబంధనలను పాటించని వ్యక్తులను ఆపి వారికి వివరించాలని కోరారు. మాస్క్ ధరించకుండా పబ్లిక్ ప్లేస్ కు వెళ్లడంతో ఓ దేశ ప్రధానికి 13 వేల జరిమానా విధించిన సంగతి గుర్తు చేశారు. గ్రామానికి సర్పంచి అయినా దేశ ప్రధానమంత్రి, ఎవరూ నిబంధనలకు అతీతులు కారు అని, బల్గేరియా ప్రధాని బోయికో బోరిసోవ్ గురించి తన ప్రసంగంలో మోదీ ఉదాహరించారు.

అన్ని జాగ్రత్తలు తీసుకొని మరిన్ని ఆర్థిక కార్యకలాపాలను మరింత వేగం పుంజుకునేలా చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. స్వావలంబన భారత్ కోసం మనందరం 'local for vocal' సంకల్పంతో కదలాలని పిలుపు నిచ్చారు. 130 కోట్ల మంది దేశస్థులు ఇదే సంకల్పంతో కలిసి పనిచేయాలన్నారు.

Post a Comment

0 Comments