నాడు చదువు రాణి వ్యక్తి నేడు సమాజానికి ఆదర్శంగా నిలిచిన వెంకటనాయక్ ...................

నాడు చదువు రాణి వ్యక్తి నేడు సమాజానికి ఆదర్శంగా నిలిచిన వెంకటనాయక్ ...................


గిరిజనులు ఊరికి దూరంగా ఎందుకు ఉండాలి .వైద్య వంతులై సమాజంలో ఎందుకు రాణించకూడదు .అన్న ప్రశ్నలకు ఆయన మదిని తొలిచాయి తాము కూడా సమాజంలో అన్ని రంగాల్లో ఎదగాలనే ఆలోచన ఇతరులకు మార్గదర్శకమైంది .తనకు అక్షరం రాకున్నా తండాలోని పిల్లల  విద్య్హ గురించి ఆలోచిస్తూనే ముగ్గురు కుమారులను కూడా ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దారు . ఆయనే వర్ని మండలంలోని అనంతపూర్ తండాకు చెందిన వెంకటనాయక్ .

 కుటుంబ నేపథ్యం :

వర్ని మండలం లో ని అనంతపూర్ తండాకు చెందిన వెంకటనాయక్ సంతకం తప్ప ఏమి చదవలేరు తండాకు దారులు విద్యుత్తూ పాఠశాల లాంటి మౌలిక సౌకర్యాలు లేకపోవడం తో పిల్లలను ఎక్కడ చదివించాలో అర్తం కాలేదు .దీంతోనే 1975 తండాలో ఒక ప్రైవేట్ పాఠశాలను స్వయంగా ఏర్పరచి చదువు చెప్పే వ్యక్తికీ నెలకు రూ.౩౦౦ వేతనాన్ని ఇచ్చారు . ఆ పాఠశాలలో వెంకట్నాయక్ పిల్లలే కాకుండా తండాలోని పిల్లలందరూ చదువుకున్నారు.అయితే ఐదో తరగతి వరకే ఉండడంతో పెద్ద కుమారుడు రాంచందర్ అక్కడితో ఆపేసి తండ్రికి తోడుగా నిలిచారు.ముగ్గురు కుమారులైన హరికృష్ణ ,మోతిలాల్ ,జగ్గు రామ్ లను ఎంత కష్టమైనా విద్యావంతులను చేయాలనీ నిర్ణయించుకున్నారు.మరిన్ని స్టోరీలకోసం http://www.chattamtv.com

విద్య కోసం పొలాలను అమ్మి.............

 పిల్లల చదువులు సమాజంలో వారికీ మంచి స్తానం కల్పించాలని వెంకటనాయక్ దంపతులు నిర్ణయించుకున్నారు . తండాలో చదువు సౌక్యారం లేకపోవడం తో పిల్లలను దురా ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు


పంపించారు.తరగతులు పెరిగే కొద్ది చదువుకు అయ్యే ఖర్చులు అధికమవడం తో వ్యవసాయ భూములను అమ్మేశారు . వారి కష్టానికి పిల్లల పట్టుదల తోడైంది . నేడు ఆ పిల్లల్లో ఒకడైన వారి కృష్ణ ఎంబీబీస్ పూర్తి చేసి కొంతకాలం ప్రభుత్వ వైద్యులుగా విధులు నిర్వహించారు .

ప్రస్తుతం నిజామాబాదు జిల్లాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిని ఏర్పరిచి వైద్యసేవలు అందిస్తున్నారు .మరో కుమారుడు మోతిలాల్ హైద్రాబాద్ లో ని విమానయానశాఖలో అధికారిగా ,ఇంకొక కుమారుడు జాగ్ రామ్
నిజామాబాదు జిల్లాలోని BSNL లో AGM గా విధులు నిర్వహిస్తున్నారు .ఈయన సేవలను గుర్తించిన ప్రభుత్వం త్వరలో హైదరాబాద్ లో విశిష్ట సంచార సేవ పతాకం అవార్డుతో సన్మానించనుంది.

 తండా అభివృద్ధికి పాటుపడుతూ ......


రాజకీయాల్లో  ఉన్న పరిచయలతో తండా అభివృద్ధికి పాటుపడ్డారు వెంకటనాయక్.అప్పట్లోనే రోడ్ల సౌకర్యం కల్పించారు.అంధకారంలో ఉన్న తండాకు 1982 లో విద్యుత్తూ సౌకర్యం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు.1985 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు స్థలాన్ని విరాళంగా ఇచ్చి తండాలో పిల్లల చదువును ప్రోత్చాయించారు.మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ,అప్పటి మంత్రులు బాగారెడ్డి ,కోట్ల విజయభాస్కర్ రెడ్డి జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులతో ఆయనకు వ్యక్తిగత పరిచయాలను సొంతపనులకు వాడుకోకుండా తండా అభివృద్ధికే కృషి చేసి మార్గదర్శిగా నిలిచారు.
తమ చదువుకోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు .నిత్యం మా ఎదుగుదల గురించే ఆలోచించేవారు. వారు చదువుకోకపోయిన చదువు విలువ తమకు తెలిపి సమాజంలో మంచిస్థానం లో నిలిపారు.నాన్నే మాకు స్ఫూర్తి పొలాలు,పాడిసంపద  తమ వల్లే పోయిందని ఎప్పుడు బాధపడరు.చదువే నిజమైన ఆస్తి అని నాన్న
  చెబుతారు

Post a Comment

0 Comments