కాగా రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నాలుగేళ్లలో 6.19 కోట్ల మేర వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఈ కేసుల్లో నమోదైన జరిమానాల్లో ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే వసూలయ్యాయి. మిగతా జరిమానాల కోసం పోలీసు శాఖ ఇప్పుడు రాయితీలు ప్రకటించింది. ద్విచక్రవాహనదారులు 75 శాతం రాయితీతో ఈ-లోక్ అదాలత్ లో చలానాలను క్లియర్ చేసుకోవచ్చు. అంటే ద్విచక్ర వాహనంపై రూ.1000 జరిమానా పెండింగ్ లో ఉంటే రాయితీ పోగా రూ. 250 చెల్లిస్తే సరిపోతుంది. దీనికి రూ.35 సర్వీస్ చార్జి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వాహనదారులు ఎలాంటి పడిగాపులు, క్యూలైన్లు, అవసరం లేకుండా తమ జరిమానాలను ఈ-చలానాల వెబ్‌సైట్ లోనే పెండింగ్ చలానాలను రాయితీతో చెల్లించేలా పోలీసు శాఖ పోర్టల్‌ను అప్‌డేట్ చేస్తోంది. ఈ అప్ డేట్ సాఫ్ట్ వేర్ మార్చి1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులోకి ఉండనుంది ఈ వెబ్‌సైట్’ను ఉపయోగించి చలానాలను చెల్లించవచ్చు.
0 Comments