టీడీపీకి మరో షాక్ తగిలింది.. అనుకున్నదే జరిగింది. ఆ పార్టీ నేత చెలమలశెట్టి సుమన్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. సోమవారం ఆయన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. ఆయన వెంట పలువురు అనుచరులు కూడా మళ్లీ తిరిగి సొంతగూటికి చేరనున్నారు. చాలా రోజులుగా సునీల్ చేరికపై ప్రచారం జరుగుతున్నా ఆలస్యమవుతుందని అందరూ భావించారు.. కానీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.
సునీల్ మూడుసార్లు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం తరపున.. 2014లో వైఎస్సార్‌సీపీ.. 2019లో టీడీపీ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజకీయంగా చాలా కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. అయితే కొద్దిరోజులుగా ఆయన వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రాంతంలో చెలమలశెట్టి సునీల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మూడుసార్లు, మూడు పార్టీలు మారినా ఆయన ఎంపీ ముచ్చట మాత్రం తీరలేదు.. మూడుసార్లు ఆయనకు ఓటమి ఎదురైంది. ఆర్థికంగా, స్థానికంగా బలమైన నేతగా ఉన్నా నిరాశే ఎదురవుతోంది.
0 Comments