దేశంలోని లేహ్,మంగళూరు, కోజికోడ్ విమానాశ్రయాలు ఈ తరహకు చెందినవే. వీటిని ఎత్తైన కొండల మధ్య పీఠభూముల్లో నిర్మించారు. రన్‌వేకు ఓవైపు లేదా రెండు వైపులా గానీ లోయలుంటాయి. ఏ మాత్రం అదుపుతప్పినా రెప్పపాటులో ఘోరం జరిగిపోతుంది. సుదీర్ఘమైన అనుభవమున్న పైలట్లకు కూడా ఈ రన్‌వేలపై విమానాలను ల్యాండింగ్ చేయడం పెద్దసవాల్. తాజాగా, ప్రమాదానికి గురైన బోయింగ్ 737 విమానాన్ని నడిపినవారిలో యుద్ధ విమానం నడపడంలో అపార అనుభవం ఉన్న వింగ్ కమాండర్ దీపక్ వసంత్ సాథే ఉన్నారు.
2010లో మంగళూరు విమానశ్రయంలో ఇలాంటి ప్రమాదం చోటుచేసుకుని 158 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం ల్యాండింగ్ అవుతూ అదుపుతప్పి రన్‌వే నుంచి పక్కకు వెళ్లి కిందనున్న లోయలోకి జారిపోయింది. మళ్లీ అదే టేబుల్‌టాప్ రన్‌వే ఉన్న కోలికోడ్ విమానాశ్రయంలో ప్రమాదం జరగడం గమనార్హం.
మరోవైపు, విమానం ల్యాండింగ్ సమయంలో కోజికోడ్‌లో భారీగా వర్షం కురుస్తోంది. దీని వల్ల విమానం రన్‌వే నుంచి దిగి జారుకొని వెళ్లిపోవడంతో ప్రమాదం జరిగివుంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టేబుల్ టాప్ రన్‌వే కావడంతో పాటు భారీ వర్షానికి విమానం రన్‌వే నుంచి కిందకు వెళ్లిపోయివుండవచ్చని పలువురు విమానయాన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
0 Comments