నగరంలో అధికారులతో కలిసి అభివృద్ధి పనులని పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల 

నగరంలో అధికారులతో కలిసి అభివృద్ధి పనులని పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల 

(చట్టం - నిజామాబాద్ ) : గత నెల జులై 13 వ తేదీన అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల మునిసిపల్ అధికారులు, R & B అధికారులు, పబ్లిక్ హెల్త్ అధికారులతో Zoom App లో సమీక్ష సమావేశం నిర్వహించి నగరంలో జరుగుతున్న డివైడర్ ల నిర్మాణం, ప్లాంటేషన్, సెంటర్ మీడియం పనుల నిర్మాణం వేగవంతం చేయాలని, అలాగే సుందరికరణ లో భాగంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ రోజు అట్టి పనులు డివైడర్ ల నిర్మాణం, ప్లాంటేషన్, రఘునాథ చెరువు వద్ద నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ పనులని అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం నిజామాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి క్యాంపు కార్యాలయంలో మునిసిపల్ అధికారులు, RWS - మిషన్ భగీరథ అధికారులు, National Highway అధికారులు, రెవిన్యూ డివిజన్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ...

నిజామాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న, నూతనంగా నిర్మించిన సెంటర్ మీడియం, డివైడర్ పనులకు సంబంధించి పలు సూచనలు చేశారు. డివైడర్లు, సెంటర్ మీడియం, డివైడర్ ల మధ్యలో నాటిన చెట్లు పరిరక్షణ, పర్యవేక్షణ కొరకు వాటి రొటీన్ మెయింటైనెన్సు కొరకు నగరంలో 5 జోన్ లకి ప్రత్యేక అధికారులని నియమించాలని కమిషనర్ ని ఆదేశించారు. మొక్కలు, చెట్ల సంరక్షణ కొరకు ప్రతి జోన్ కి ఒక నీటి ట్యాంకర్ ఏర్పాటు చేయాలన్నారు.

అవసరం ఉంటేనే నిధులు ఖర్చు చేయాలని మునిసిపల్ అధికారులని సూచించారు. నగరంలో అక్కడక్కడ చెడిపోయిన రోడ్లని మెయింటైనెన్స్ లో భాగంగా సంభందించిన శాఖ వారు రీస్టోరేషన్ చేయాలన్నారు. నిజామాబాద్ నగర అభివృద్ధి కొరకు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదికారులని కోరారు.

ఈ సమావేశంలో మునిసిపల్ కమిషనర్ జితేశ్ వి పాటిల్, మునిసిపల్ ఇంజినీర్ సాగర్, రషీద్, రెవిన్యూ డివిజనల్ అధికారి రవి, RWS - మిషన్ భగీరథ ఎస్ ఈ రాజేంద్ర కుమార్, ఈ ఈ నరేష్, డి ఈ అరుణ్, జాతీయ రహదారుల శాఖ ఈ ఈ కాంత రావు, తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments