రైతులకు సీఎం జగన్ వరాలు.. ఆ మేలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఏపీ..

రైతులకు సీఎం జగన్ వరాలు.. ఆ మేలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఏపీ..


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న జగన్ ప్రభుత్వం.. ఈ సందర్భంగా రైతులకు మరో గుడ్ న్యూస్ అందించారు. టీడీపీ హయాంలో వడ్డీలేని రుణాల కోసం రైతులకు బకాయి పడ్డ రూ. 1150 కోట్ల రూపాయలను సీఎం జగన్ విడుదల చేశారు. ఇప్పటికే వడ్డీలేని రుణాల కోసం రూ. 96.50 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. రైతులకు ఎంతో మేలు చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని సీఎం జగన్ గుర్తు చేశారు. 57 లక్షల మంది రైతులకు వారి ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నామని అన్నారు. అక్టోబర్ నాటికి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని తెలిపారు. ఖాతాల్లో డబ్బు రాని రైతులు ఆందోళన చెందవద్దని సీఎం జగన్ అన్నారు. కాస్త ఆలస్యమైనా... అందరికీ ఈ సాయం అందుతుందని స్పష్టం చేశారు. చెరుకు రైతులకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా తాము చెల్లిస్తున్నామని చెప్పారు.



Post a Comment

0 Comments