ఎన్నికల సమయంలో ఈ పథకం అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలందరికీ ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. ఇప్పటికే లబ్ధిదారులు జూన్ 28 నుంచి దరఖాస్తులు ఇచ్చారు. కానీ ప్రభుత్వ పింఛన్ తీసుకుంటున్న మహిళలకు కూడా జగన్ ఇప్పుడు అవకాశం కల్పించారు. ఆర్థికంగా భారమైనప్పటికీ వారికి కూడా వైఎస్సార్ చేయూత కింద ప్రయోజనాలను అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆమేరకు వారినీ పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. ఈ పథకం కింద ఏడాదికి రూ.1,540 కోట్లకు పైగా, నాలుగేళ్లలో రూ.6,163 కోట్ల మేర ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయనుంది.
0 Comments