వైద్యం ఖర్చు రూ.10000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడంతో పాటు, కొత్తగా ఆరు జిల్లాలకు పథకాన్ని విస్తరించారు. ఆరోగ్యశ్రీలో మొత్తం 2200 రకాల వైద్య ప్రక్రియలను అందజేస్తూ విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, కర్నూలు జిల్లాలకు పథకాన్ని విస్తరించారు. క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ గురువారం దీన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్, ఆయా జిల్లాలలోని అధికారులు, పథకం లబ్ధిదారులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. వైద్యం అందక ఏ ఒక్కరూ చనిపోకూడదని, ఆ దిశలోనే పలు చర్యలు తీసుకుంటున్నామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలని అడుగులు వేశామన్న ఆయన, ఆరోగ్యశ్రీ పథకంలో ఇవాళ మరో అడుగు ముందుకు వేశామని తెలిపారు. ఇంకా ఆరోగ్యశ్రీ పరిధిని విస్తృతంగా పెంచుతూ పోతున్నామని చెప్పారు.
0 Comments