-ఆపన్నులకు భోజన సౌకర్యం...
నిజామాబాద్ (చట్టం) : ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం ఏర్పడినా ముందుగా స్పందించి వారిని ఆదుకోవడానికి ఆపన్నహస్తం అందించే నేస్తం ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త. ప్రస్తుం ప్రపంచమంత కరోనా కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతుంది. దేశంలోని ప్రజలను ఈ రక్కసి కోరలలోంచి కాపాడడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నేపద్యంలో దినసర కూలీలు, వలస కార్మికులు ఉపాధి లేక, పట్టెడన్నం దొరకక దిక్కుతోచని స్థితిలో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో వారి అవసరాలను, ఆకలి బాధలను మానవత్వంతో అర్థం చేసుకొని వారిని ఆదుకోవడానికి వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు.
చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బంది పడుతూ ఎవరిని ఆశ్రయించాలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్న వారిని అడగకుండానే పెద్ద మనస్సుతో ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్, కిసాన్ క్లాత్ ఎంపోరియం గ్రూప్ ఆధ్వర్యంలో మార్చి 24 నుంచి ప్రతి రోజు ఇందూరులోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు భోజన వసతి కల్పించి వారి ఆకలి బాధలు తీరుస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా నిజామాబాద్‌లోని డివిజన్‌ల వారిగా అందించడానికి పూనుకున్నారు.
10రోజులకు సరిపడే నిత్యవసర వస్తువుల కిట్‌లను తయారు చేసి ఎంచుకున్న డివిజన్‌లో పంపిణి చేస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో తన వారే దూరమయ్యే ఈ రోజుల్లో అందరిని తనవారిగా భావించి ఆదుకునే గొప్ప మనసున్న మానవతావాది సూరన్న
కరోనా నివారణ చర్యలకు సాయమందించాలని ప్రధాని మోది ఇచ్చిన పిలుపుకు ట్రస్ట్ ప్రతినిధులు స్పందించారు. కరోనా కట్టడికి తమ వంతు బాధ్యతగా ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్త ట్రస్ట్, కిసాన్ క్లాత్ ఎంపోరియం గ్రూప్ సంయుక్తంగా ప్రధాన మంత్రి సహాయ నిధికి 5లక్షలు, సిఎం సహాయ నిధికి 5లక్షలు అందజేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబందించిన రెండు చెక్కులను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ ట్రస్టు ప్రతినిధులు అందజేశారు.

0 Comments