
ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సేల్‌తో ముందుకొచ్చింది. ఫోన్లపై డిస్కౌంట్‌తో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్- 2020 సేల్‌ను ప్రకటించింది. నేటి నుంచి (ఫిబ్రవరి 26 నుంచి) ఈ నెల 29 వరకు ఈ సేల్ నడవనుంది. ఇందులో మొబైల్ ఫోన్లపై డిస్కౌంట్‌తో పాటు నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్‌పై ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు, కొటాక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డు యూజర్లు 10 శాతం అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.
వన్‌ప్లస్ 7టీ 8జీబీ/128జీబీ మొబైల్ వేరియంట్ అసలు ధర రూ.37,999 కాగా ఈ సేల్‌లో 34,999కే విక్రయిస్తున్నారు. అదనంగా రూ.8,850 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కంట్ పొందొచ్చు. వన్‌ప్లస్ 7ప్రో 42,999 (రూ.52,999)కే లభిస్తోంది. ఒప్పో రీనో 10ఎక్స్ జూమ్ ఫోన్ ఎంఆర్‌పీ రూ.55,990 కాగా, రూ.32,990కే విక్రయిస్తున్నారు. శాంసంగ్ ఎం30 4జీబీ/64జీబీ వేరియంట్‌ను రూ.11,999 (రూ.16,490)కు, ఆనర్20 రూ.22,999 (రూ.35,999), వివో వీ17ప్రో రూ.27,990 (రూ.32,990)కు విక్రయిస్తున్నారు. రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20ప్రో ఫోన్ల కొనుగోలుపై సాధారణం కంటే రూ.3,000 అదనపు ఎక్స్ఛేంజ్ విలువను ఈ సేల్‌లో పొందొచ్చు.
0 Comments