ఆర్టీసి సమ్మె ఉదృతం, ప్రభుత్వం చర్చలకు పిలువకుంటే వెనుకంజ వేసేది లేదు||The rtc strike will not hesitate to call for government talks(Nizamabad District)

ఆర్టీసి సమ్మె ఉదృతం, ప్రభుత్వం చర్చలకు పిలువకుంటే వెనుకంజ వేసేది లేదు||The rtc strike will not hesitate to call for government talks(Nizamabad District)

 rtc strike will not hesitate to call for government talks



nizamabad,nizamabad district



Nizamabad District: ‌గత 13రోజులుగా తెలంగాణ ఆర్టీసి కార్మికులు 50వేల మంది సమ్మెలో పాల్గొనగా ప్రభుత్వం ఎలాంటి చర్చలకు పిలువకుండా మొండిగా CM KCR ‌వ్యవహరించాడన్ని ఆర్టీసి జెఏసి, ఇతర వామపక్ష సంఘాలు, విద్యార్థి సంఘాలు తప్పుబట్టాయి. న్యాయమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేయడం కార్మికుల హక్కు అని అన్నారు. దానిలో సాధ్యాసాధ్యాలు కార్మికనాయకులతో ప్రభుత్వం చర్చించి ఒప్పందంకు రావాలని కాని మొండిగా వ్యవహిరిస్తే సమ్మె ఇంకా ఉదృతంగా మారి సకలజనుల సమ్మెగా మారుతుందని, ప్రభుత్వం ఉనికికే ప్రమాదంగా మారే అవకాశం ఉందని అన్నారు. హైకోర్టు, రాష్ట్ర గవర్నర్‌లు TRS Government చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపినా పెడచెవిన పెట్టడంను తీవ్రంగా ఖండించారు. 


                             
nizamabad news,nizamabad distric

మాది న్యాయమైన పోరాటం అని, నేటికి సెప్టెంబర్‌, 2019 ‌జీతాలు చెల్లించలేదని, సిబ్బంది సమ్మెలో ఉన్నారు అని తెలుపడం సబబు కాదని, అలాగయితే బస్సులను వేరేవారిని పెట్టి ఎలా నడుపుతున్నారు అలాగే జీతాలు ఇతర డిపార్ట్‌మెంట్‌ ‌లేదా ఆర్టీసి హైయ్యర్‌ అధికారులతో చేయించి వెంటనే కార్మికుల ఖాతాలో వేయాలని డిమాండ్‌ ‌చేసారు. 19న రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ ‌కార్యక్రమానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, సంఘాలు, టిఎన్‌జిఓలు, కార్మికసంఘాలు, వామపక్షపార్టీలు,Congress, ‌BJP, ఇతర పార్టీలన్ని సంపూర్ణ మద్దతు తెలుపాయని, రాష్ట్రబంద్‌లో పాల్గొంటాయని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఆర్టీసి జెఏసి నాయకులు వందేమాతరం శ్రీనివాస్‌, ‌సాయిలు, అబ్బయ్య నరేష్‌చందర్‌, ‌వనమాలకృష్ణ, కంజరభూమయ్య, నూర్జహాన్‌, ‌సుదాకర్‌, ఓమయ్య, వెంకటేశంగుప్త, Congress Party,Telangana జెఏసి నాయకలు, విద్యార్థి సంఘాల నాయకులు నర్సింగ్‌రావు, ఏఐటియుసి, సిఐటియు నాయకులు వందలాదిగా పాల్గొని నగరంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో హల్‌చల్‌ ‌సృష్టించడం జరిగిందని తెలిపారు.

Post a Comment

0 Comments