PM Kisan: రైతులకి అలర్ట్‌.. ఈ తప్పులుంటే 12 విడత డబ్బులు రావు..

PM Kisan: రైతులకి అలర్ట్‌.. ఈ తప్పులుంటే 12 విడత డబ్బులు రావు..

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాకు సంవత్సరానికి రూ. 6000 అందిస్తోంది. అంటే 2000 రూపాయలు మూడు విడతలలో చెల్లిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ పథకంలో చాలా మార్పులు వచ్చాయి. కొన్నిసార్లు దరఖాస్తుకు సంబంధించి, కొన్నిసార్లు అర్హత గురించి అనేక కొత్త నియమాలు రూపొందించారు. ఇప్పటి వరకు 11 వాయిదాలు రైతుల ఖాతాల్లోకి చేరాయి. కానీ చాలాసార్లు దరఖాస్తులో తప్పులు దొర్లడంతో రైతుల వాయిదాలు ఆగిపోతున్నాయి. 

 మరోసారి తెరపైకి బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు... ఆ హీరోయిన్‌కు జైలు శిక్ష తప్పదా? పిఎం కిసాన్ యోజన కింద కోట్లాది దరఖాస్తులు కేంద్ర ప్రభుత్వానికి వచ్చాయి. అయితే వాటిలో చాలా తప్పులు ఉన్నాయి. ఈ కారణంగా రైతుల వాయిదాలు ఆగిపోయాయి. బ్యాంక్ వివరాల నుంచి టైపింగ్ వరకు రకరకాల తప్పులు చేశారు. ఒక్కోసారి పేర్లు తప్పుగా ఉంటే, ఒక్కోసారి ఆధార్ కార్డు వివరాలు సరిపోలడం లేదు. అందుకే వారికి రావాలసిన డబ్బులు ఆగిపోయాయి. ఇలాంటి వారు వాటిని వెంటనే సరిదిద్దు కోవాల్సి ఉంటుంది. 

 రైతు ఫారమ్ నింపేటప్పుడు పేరును ఆంగ్లంలో రాయాలి. అప్లికేషన్‌లోని పేరు, బ్యాంక్ ఖాతాలోని దరఖాస్తుదారు పేరు వేర్వేరుగా ఉంటే డబ్బు నిలిచిపోతుంది. ఐఎఫ్‌ఎస్‌సి కోడ్, బ్యాంక్ ఖాతా నంబర్, బ్యాంక్ గ్రామం పేరు రాయడంలో పొరపాటు జరిగితే మీ ఇన్‌స్టాల్‌మెంట్ ఖాతాలో జమ కాదు. ఇటీవల బ్యాంకుల విలీనం కారణంగా IFSC కోడ్‌లు మారాయి. కాబట్టి దరఖాస్తుదారు తన కొత్త IFSC కోడ్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. 


ఈ తప్పులను సరిదిద్దండి 1. తప్పులను సరిదిద్దుకోవడానికి ముందుగా మీరు pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి. 
2. ఇప్పుడు 'ఫార్మర్స్ కార్నర్' ఎంపికను ఎంచుకోండి.

 3. ఇక్కడ మీరు 'ఆధార్ సవరణ' ఎంపికను చూస్తారు. ఇక్కడ ఆధార్ నంబర్‌లో సవరణలు చేయవచ్చు.

 4. మీరు మీ బ్యాంక్ ఖాతా నంబర్‌లో పొరపాటు చేసినట్లయితే దాన్ని సరిదిద్దడానికి మీరు వ్యవసాయ శాఖ కార్యాలయం లేదా అకౌంటెంట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.


Post a Comment

0 Comments