తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పలు సమస్యలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. ఇవాళ కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్రసింగ్తో భేటీ అవుతారని తెలుస్తోంది. శనివారం కేంద్ర పౌరవిమానయాన, హౌసింగ్ శాఖ మంత్రి హర్దీప్ పురిని కలుస్తారని సమాయచారం. వీరితో భేటీకి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఖరారయింది. గజేంద్రసింగ్, హర్దీప్ సింగ్ పురితో పాటు మరికొందరు కేంద్రమంత్రులతోనూ సీఎం కేసీఆర్ భేటీ అవుతారని సమాచారం.
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సమయంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తుండడం చర్చనీయంశమైంది. ముందు నుంచీ ఈ చట్టాలను ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల జరిగిన భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు కూడా తెలిపారు. ఐతే ఢిల్లీ పర్యటనలో భాగంగా రైతు సంఘాల నేతలతోనూ సీఎం కేసీఆర్ సమావేశమయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఇక ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్కు కేటాయించిన స్థలాన్ని కూడా పరిశీలించనున్నారు. ఒకవేళ అపాయింట్మెంట్ ఖారారయితే ప్రధాని నరేంద్ర మోదీతోనూ సీఎం కేసీఆర్ భేటీ కానున్నట్లు సమాచారం. తిరిగి ఆదివారం సాయంత్రం ఆయన హైదరాబాద్కు వచ్చే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.
0 Comments