ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం వైఎస్ జగన్, తన సతీవమణి వైఎస్ భారతితో కలిసి విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో సీఎం జగన్ అరగంటపాటు సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు అంశాలపై గవర్నర్‌తో ముఖ్యమంత్రి చర్చించినట్లుగా తెలుస్తోంది. అలాగే అసెంబ్లీలో ఆమోదించాల్సిన కీలక బిల్లుల విషయంపై కూడా గవర్నర్‌తో చర్చించినట్టుగా సమాచారం. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, సంక్షేమ పథకాలు అమలును గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించారు.
మరోవైపు దీపావళి పర్వదినం సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలనకు శుభాకాంక్షలు తెలియజేశారు. "ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీపావళి రోజున ప్రకాశించే కాంతి ప్రతి ఒక్కరికి శాంతి, ఆనందాన్ని, శ్రేయస్సును ఇవ్వాలి. దీపావళి అనేది చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ఇలాంటి సందర్భాలు విపత్తులను జయించడానికి, శాంతి, స్నేహం, మత సామరస్యం నింపిన సమాజాన్ని నింపిన సమాజాన్ని నిర్మించడానికి సాయపడతాయి. కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ పండగను జరుపుకోవాలి, మాస్క్‌లు ధరించడం, చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం ద్వారా వైరస్‌ను నియంత్రించాలి. మనందరికి ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా జగన్నాథ స్వామిని, వెంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నాను"అని గవర్నర్ విశ్వభూషణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
0 Comments