భవిష్యత్తుకు బాటలు వేయడమే లక్ష్యంగా ‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోంది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం, పునాదిపాడు ప్రభుత్వ పాఠశాలలో గురువారం (8-10-2020) ఈ కార్యక్రమాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు.
ఏమిటి ‘జగనన్న విద్యా కానుక?’:
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరు విద్యార్థినీ, విద్యార్థులకు ఈ కార్యక్రమంలో ప్రత్యేక స్కూల్ కిట్‌లు అందజేయనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 42,34,322 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగబోతోంది. సుమారు రూ.650 కోట్ల విలువైన స్టడీ కిట్లను విద్యార్థులకు ఇస్తారు.
కిట్‌లో ఏముంటాయి?:
జగనన్న విద్యా కానుక కింద పిల్లలకు అందజేసే కిట్‌లో 3 జతల యూనిఫారాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్ టెస్ట్ బుక్స్, నోటు బుక్స్, వర్క్ బుక్స్, ఒక స్కూల్ బాగ్ ఉంటాయి.
0 Comments