బిగ్ బ్రేకింగ్…కరోనా వ్యాక్సిన్ విడుదల చేసిన రష్యా

బిగ్ బ్రేకింగ్…కరోనా వ్యాక్సిన్ విడుదల చేసిన రష్యా

యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు వణికిపోతున్న వేళ, ప్రజలు ప్రాణాలు మాస్కులో పెట్టుకుని జీవిస్తున్న వేళ రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. రష్యా కరోనా వ్యాక్సిన్ విడుదల అయింది. కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేసినట్లు మంగళవారం(ఆగస్టు-11,2020) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. టీకాను పరీక్షించిన వారిలో తన కుమార్తె కూడా ఉన్నట్లు పుతిన్ తెలిపారు. ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి కరోనా వ్యాక్సిన్ ఇదే.
రష్యా రక్షణశాఖ, గమలేయ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను మంగళవారం(ఆగస్టు-11,2020)ఉదయం రిజిస్టర్ చేసిన తొలి దేశంగా రష్యా నిలిచింది.
తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేసినట్టు ప్రకటించారు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ . ఈ టీకా ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. టీకాను పరీక్షించిన వారిలో తన కుమార్తె కూడా ఉన్నట్టు తెలిపిన పుతిన్ .. ఆమె ఆరోగ్యంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు పరీక్షిల్లో తేలిందని పుతిన్ పేర్కొన్నారు. కరోనా వైరస్ నుంచి శాశ్వత రోగనిరోధక శక్తిని ఈ టీకా అందిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రజలకు విడుదల చేసేందుకు కావాల్సిన పరీక్షలన్నీ ఈ వ్యాక్సిన్ పై జరిపినట్టు పేర్కొన్నారు రష్యా అధ్యక్షుడు. పంపిణీలో భాగంగా తొలుత ఈ టీకాను ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, వైరస్ ప్రమాదం అధికంగా పొంచి ఉన్న వారికి అందివ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు.
వాక్సిన్ అభివృద్ధి కోసం కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు పుతిన్. యావత్ ప్రపంచానికి ఇది ఎంతో కీలకమైన అడుగు అని ఆయన అన్నారు. త్వరలోనే కరోనా వాక్సిన్‌ను ఉత్పత్తిని వేగవంతం చేసి.. ప్రపంచమంతటికీ సరఫరా చేస్తామని చెప్పారు. రష్యా అధ్యక్షుడు విడుదల చేసిన వాక్సిన్‌ను గమలేయ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, రష్యా రక్షణశాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. జూన్ 18న ఈ వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. 38 మంది వాలంటీర్లపై ఔషధ ప్రయోగాలు చేశారు. ఫస్ట్ బ్యాచ్ వాలంటీర్లు జులై 15న డిశ్చార్జి అయ్యారు. సెకండ్ బ్యాచ్ వాలంటీర్లు జులై 20న డిశ్చార్జి అయ్యారు. వీరందరిలోనూ రోగ నిరోధక శక్తి పెరిగింది.

Post a Comment

0 Comments