ఏ ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన నగర మేయర్

ఏ ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన నగర మేయర్

(నిజామాబాద్ - చట్టం) : నిజామాబాద్ నగరంలోని కిల్లా రోడ్ లో జడ్ ప్లస్ బిల్డింగ్ లో ఏర్పాటు చేసిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నగర మేయర్ దండు నీతి కిరణ్ సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొత్తం డాక్టర్ల అందరు మైనారిటీలు కావడం నిజామాబాదు లో ప్రత్యేకత చాటుకుంది అన్నారు. అన్ని విభాగాలకు డాక్టర్లు ఉన్నందుకు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగర జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటు ధరలలో అందించి ప్రజల మన్ననలను పొందాలని తెలిపారు. ఏ ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ ఎండి షకీల్ అహ్మద్ ను అభినందించారు.

ఈ సందర్భంగా చైర్మన్ షకీల్ అహ్మద్ మాట్లాడుతూ.. నిజామాబాద్ నగర జిల్లా ప్రజలు మెప్పు పొందే విధంగా వైద్య సేవలను అతి తక్కువ ధరలో అందిస్తామని తెలిపారు. వైద్య పరీక్షలకు అవసరమయ్యే ల్యాబ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రెడ్ కో చైర్మెన్ సలీమ్ ఉద్దీన్ నగర డిప్యూటీ మేయర్ ఇదిరిస్ khan, కాంగ్రెస్ పార్టీ అర్బన్ ఇన్చార్జ్ తాహెర్ బిన్ హందాన్, కార్పొరేటర్ మహమ్మద్ హుస్సేన్ , నుడ డైరెక్టర్ అక్తర్ హైమద్ ఆల్ ఇండియా ముస్లిం కౌన్సిల్ ప్రెసిడెంట్ ముక్తి నదీమ్ దీం డాక్టర్లు ఎండి షరీఫ్ ఉద్దీన్ (ఎమ్మెస్ )ఎండి రహమాన్ ఎండి (జనరల్ ఫిజీషియన్) అబ్దుల్ ఖయ్యుం సల్మాన్ (డయాబెటాలజిస్ట్) అతిక్ (బీడీఎస్ ) నగర ప్రముఖులు వివిధ పార్టీల నాయకులు చైర్మన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments