(చట్టం -వరంగల్ రూరల్ జిల్లా/ పరకాల /శివ) నియోజకవర్గంలో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉప్పొంగిన వాగులు, చెరువులు, పలు ప్రధాన రహదారులు జల దిగ్భంధం,నిలిచిపోయిన వాహనాల లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి చేరిన వర్షపు నీరుని దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రజలకు సూచనలు చేశారు. అధికారులు,ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, అన్ని శాఖల అధికారులతో,స్థానిక ప్రజాప్రతినిధులతో గ్రామాలలో ప్రస్తుత పరిస్థితులపై టేలికాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడరు. పరిస్థితులు మెరుగయ్యేవరకు గ్రామ అధికారులు గ్రామంలొనే ఉండాలని, ప్రజలు గ్రామం వదిలి రావొదని, ఈ విపత్తులో ఇండ్లు కూలిపోయిన వారందరికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో సీఎం కేసీఆర్ దృష్టికి సమస్య తీసుకెళ్లి ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామాలలో పరిస్థితులు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని అధికారురులకు,ప్రజాప్రతినిధులకు చూచించారు.
0 Comments