గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటు అనుమతిలేదు : ACP శ్రీనివాస్

గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటు అనుమతిలేదు : ACP శ్రీనివాస్

(చట్టం -వరంగల్ రూరల్ జిల్లా/ పరకాల /శివ) కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్యా ఈ నెల 22వ తేదీన నిర్వహించుకోనే వినాయకచవితి పండుగ సందర్భంగా పరకాల Division పరిధిలో సామూహిక పూజలతో పాటు, గణేష్ నవరాత్రి ఉత్సవ నిర్వహణకు నెలకొల్పబడే గణేష్ మండలపాల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేవని పరకాల ACP శ్రీనివాస్తెలిపారు. ప్రజలందరు ఎవరి ఇంటి వద్ద వారే వినాయక చవితి పూజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సి వుంటుందని, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యమైన కూడళ్ళలో విగ్రహాల ఏర్పాటు నిషేధమని, అదే విధంగా మొహర్రం పండుగను సైతం ముస్లిం సోదరులు తమ ఇంటిలోనే నిర్వహించుకోవాలని, కోవిడ్ 19 నేపథ్యంలో పోలీసుల సూచనను పాటించి కరోనా వ్యాధిని నియంత్రించడంలో ప్రజలందరు తమ వంతు భాధ్యతగా పోలీసులకు సహకరించగలని, ముఖ్యంగా పోలీసులు ఉత్తుర్వులను అతిక్రమించి గణేష్ మండపాలను ఏర్పాటు చేస్తే సంబంధిత నిర్వహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పరకాల ACP శ్రీనివాస్ తెలిపారు.

Post a Comment

0 Comments