టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో ఆ ముగ్గురు..కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా కార్యక్రమం..

టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో ఆ ముగ్గురు..కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా కార్యక్రమం..


#telugu deshsm
పార్టీ ఆఫీస్ లో, కార్యకర్తల నడుమ.. ఆడంబరంగా ప్రతి ఏడాదీ జరిగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. ఈ సారి కళ తప్పింది. కరోనా నేపథ్యంలో నేతలంతా ఎక్కడికక్కడ ఇళ్లలోనే ఉండిపోయారు. హైదరాబాద్ లోని తన నివాసంలో చంద్రబాబు పార్టీ జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట తనయుడు లోకేష్, మనవడు దేవాన్ష్ మాత్రమే ఉన్నారు. కార్యకర్తలు, నేతలు కూడా తమ ఇళ్లపై టీడీపీ జెండా ఎగురవేయాలని సూచించారు చంద్రబాబు. కరోనా సహాయక చర్యల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

Post a Comment

0 Comments