Telugu News:ఆధార్‌లో మార్పులు ఎన్ని సార్లంటే అన్ని సార్లు చేసుకోవడం ఇక కుదరదు.

Telugu News:ఆధార్‌లో మార్పులు ఎన్ని సార్లంటే అన్ని సార్లు చేసుకోవడం ఇక కుదరదు.


Telugu news,today news in telugu

ఆధార్‌లో మార్పులు చేసుకోవడం ఇక కుదరదు..

ఆధార్‌లో మార్పులు ఎన్ని సార్లంటే అన్ని సార్లు చేసుకోవడం ఇక కుదరదు. భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) వీటిపై పరిమితులు విధించింది. ఆధార్‌లో పేరును మార్చుకునేందుకు రెండు పర్యాయాలే అనుమతిస్తారు. ఇక పుట్టినతేదీని ఒకే ఒక్కసారి మార్చుకోవచ్చు. అందుకు ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించాలి. ఒకసారి పుట్టిన తేదీని ధ్రువీకరించిన తరువాత మార్పులకు అనుమతించరు. జెండర్‌ వివరాల్లోనూ ఒకసారే మార్పులకు అనుమతిస్తారు. ఒకవేళ పరిమిత సంఖ్యను మించి మార్పులు చేసుకోవాల్సి వస్తే యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాల్సిందే.

people also readingఆర్టీసీ కార్మికుల పిఎఫ్ డబ్బు ఎక్కడ ?

Post a Comment

0 Comments