గాయత్రి నగర్‌కు చెందిన ముదం షర్మిల గ్రూప్-2 పరీక్షల్లో ర్యాంక్ సాదించి ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికయ్యారు
నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్‌కు చెందిన ముదం షర్మిల 2017 సం।।లో నిర్వహించిన Group-2 పరీక్షల్లో ర్యాంక్ సాదించి ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. ముదం కిషన్-విమల దంపతుల చిన్న కుమార్తె షర్మిల 1-4వ తరగతి వరకు విశ్వశాంతి హై స్కూల్‌లో, 5వ తరగతి నుండి ఇంటర్ వరకు విశ్వభారతిలో, బిటెక్ విజయ రూరల్ ఇంజనీరింగ్ కో ఎడ్యూకెషన్‌లో పూర్తి చేశారు.
లైబ్రెరియన్ ఉద్యోగాన్ని వదులుకొని..
Group-2 పరీక్షల కోసం ఆర్.సి రెడ్డి ఇన్‌స్టిట్యూట్ హిమాయత్ నగర్‌లో శిక్షణ తీసుకున్నారు. గతంలో గురుకుల పాఠశాలలో లైబ్రెరియన్‌గా ఉద్యోగం వచ్చింది. Group-2లో ఉద్యోగం వస్తుందనే విశ్వాసంతో లైబ్రెరియన్‌గా చేరలేదని తండ్రి ముదం కిషన్ తెలిపారు. తమ కుమార్తె Group-2లో ఉద్యోగం సంపాదించడం ఆనందంగా ఉందని తెలిపారు.

0 Comments