*ధర్పల్లి మండలం* చల్లగరిగ మరియు డిబి తాండా గ్రామాల ప్రజా ప్రతినిధులు *ఈ రోజు గౌరవ నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక మరియు ప్రణాళిక, ధర్పల్లి జడ్పిటిసి సభ్యులు శ్రీ బాజిరెడ్డి జగన్ మోహన్ గారిని ఈరోజు ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు వినతి పత్రాన్ని సమర్పించారు..*
ఈ సందర్భంగా గౌరవ సభ్యులు మాట్లాడుతూ...
ధర్పల్లి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, చల్లగరిగ మరియు డి బి తాండ గ్రామాలలో ప్రజల సౌకర్యార్థం మర్రి చెట్టు నుండి హనుమాన్ టెంపుల్ వరకు బీటీ రోడ్డును మరియు అవసరమైన చోట కల్వర్టు నిర్మాణాలను గౌరవ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారి సహకారంతో పూర్తి చేస్తానని చెప్పారు..
చల్లగరిగ గ్రామంలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సవిత పోచన్న, ఎంపీటీసీ స్వామి నాయక్, ఉప సర్పంచ్ నరసయ్య, తదితరులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..
0 Comments