నిజామాబాద్ (చట్టం) : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సేవలు మరవలేనివని డిసిసిబి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి 70వ జన్మదినోత్సవం సందర్బంగా జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైద్య విద్యాశాఖ మంత్రిగా, భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పదవులకు వన్నె తెచ్చారని, అదే విధంగా మంత్రిగా జిల్లాలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేశారని తెలిపారు. సుదర్శన్ రెడ్డి హయాంలోనే జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటులో ప్రధాన పాత్ర పోశించారని అన్నారు. అంతే కాకుండా సాగునీటి రంగంపై దృష్టి సారించి రైతాంగం కోసం ప్రాణహిత చేవేళ్ల 20, 21, 22 ప్యాకేజిలు తీసుకువచ్చారని, నిజాంసాగర్ కాలువల ఆదునీకరణకోసం 100 కోట్లు, శ్రీరాంసాగర్ వరద కాలువపై రైతుల ఆలోచన మేరకు తూములను ఏర్పాటు చేయించారని తెలిపారు. కోవిడ్ కారణంగా రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు సాదారణంగా వేడుకలు జరుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, బోధన్ లో పోలీసులు వైద్య సిబ్బందికి మాస్కులు శాని టై జర్ లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments