(చట్టం - సిద్దిపేట / పిట్ల శ్రీనివాస్) కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మంత్రి హరీష్ రావు గారి సూచన మేరకు బర్ల మాల్లిఖర్జన్ 1వ వార్డులోని సుమారు 200మందితో ఫోన్ లైన్లో మాట్లాడి.. వారి ఆరోగ్య పరిస్థితులను ఆరాతీస్తూ వారికి కరోనపై తీసుకోవలిసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. బర్ల మాల్లిఖర్జన్ మాట్లడుతు.. వార్డులో గాని చుట్టుపక్కల ప్రాంతంలో గాని ఎవరైనా కరోనాకి గురైన వారికి కావాల్సిన సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని, కరోనా కి గురై ఇంట్లోనే చికిత్స చేసుకుంటున్న వారికి కూరగాయలు,నిత్యవసర వస్తువులు,హోమ్ ఐసోలేషన్ కి కావాల్సిన మందులు గాని ఇతరత్ర వస్తువులు ఏమైనా కావాల్సి వస్తే నన్ను సంప్రదించగలరని, దయచేసి కరోనాకి గురైన వారిని వివక్షతో చూడకండి, వారు ఏదో చేయకూడని తప్పు చేసినట్టుగా భావించకండి ,మనం పోరాడాల్సింది రోగితో కాదు రోగానితో అనే విషయాన్ని గుర్తుంచుకోగలరని,ఇంకా ఎవరికైన లక్షనాలు ఉన్న టెస్టు చేసుకోవాలి అనుకున్న నాకు చెప్పండని, ఎవరు ఎం అనుకుంటారో అని మీలో మీరే దాచుకోకండి రోగం ముదిరితే ప్రాణానికే ప్రమాదంని, మొదటి దశలోనే గుర్తించి చికిత్స మొదలుపెడితే దాన్ని సులువుగా జయించుకోవచని ప్రజలకు బర్ల మల్లికార్జున్ చూచించారు.
0 Comments