ఈరోజు తూర్పుగోదావరి జిల్లా లోని కొండలమీద దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో చింతలపాడు అనే గ్రామం ఉంది. అక్కడ మొత్తం ఆదివాసి కొండరెడ్లు నివసిస్తారు. ఈ లాక్ డౌన్ వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేషన్ అందక, వాళ్ళు పడే ఇబ్బందులు నాకు తెలిసింది. 50 వ రోజు అందుకు ఉదయం నాలుగున్నరకు ములుగు నుంచి బయలుదేరి కనీసం కాలినడకన ఊరు చేరుకోవాలంటే 5 కిలోమీటర్లు నడవాలి అలా అడవిలోని కొండలు, గుట్టలు దాటుకుని విజయవంతంగా వాళ్ల వద్దకు వెళ్లి బియ్యం, కూరగాయలు, పప్పు, నూనె, ఉప్పు మరియు నిత్యవసర సరుకులు అందజేసాము.మరియు ఒక్కో కుటుంబానికి 500 రూపాయలు సహాయం కూడా చేసాము. వారు నేను వస్తున్నాను అని తెలిసి నన్ను చూసి చాలా ఆనందంతో డోలు మోగించుకుంటూ స్వాగతం పలికారు.
నాతోపాటు అమ్మ ఫౌండేషన్ సంబంధించిన టీచర్లు, మరియు మాతో పాటు పని చేస్తున్న TJS నాయకురాలు భవాని రెడ్డి గారు, నా సహాయక బృందం పాల్గొన్నారు అందరికీ నా ధన్యవాదాలు.
0 Comments