కరోనా కట్టడి విషయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు తీసుకుంటున్న చర్యలు అద్భుతమని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని గారు తెలిపారు. మెప్మా ఆధ్యర్యంలో తయారుచేసిన మాస్కులను గురువారం ఎమ్మెల్యే గారు మున్సిపల్ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ శుక్రవారం నుంచి పట్టణంలో ప్రతి ఇంటికి మాస్కులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి తలా మూడు మాస్కులు అందజేస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే ఇలా ప్రతి ఒక్కరికి మాస్కులను ఏ రాష్ట్రంలోనూ పంపిణీ చేయలేదని, ఒక్క ఏపీలో మాత్రమే ఇది సాధ్యమైందని ఎమ్మెల్యే గారు చెప్పారు. సమర్థవంతమైన నాయకత్వం అంటే ఎలా ఉంటుందో తమ ప్రభుత్వాధినేతను చూస్తే అర్థమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ సీహెచ్ శ్రీనివాసరావు గారు, సీఐ సూర్యనారాయణ గారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్, వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments