Telangana News:తన భూమికి సంబందించిన పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వకుండా అధికారులు
తన భూమికి సంబందించిన పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారంటూ ఓ యువకుడు పెట్రోల్ బాటిల్ తో హల్ చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులమధ్య తగాదా కారణంగా చిల్లంచర్ల గ్రామానికి చెందిన అశోక్ భూమికి సంబందించిన పాస్ పుస్తకం జారీ నిలిచిపోవటం తో ఆగ్రహించిన అశోక్ పెట్రోల్ బాటిల్ తో ఎమ్మార్వో ఆఫీస్ లోకి వచ్చి ఆత్మహత్య చేసుకుంటా అంటూ బెదిరించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అశోక్ కు నచ్చజెప్పి పాస్ పుస్తకం వచ్చేటట్టు అధికారులతో మాట్లాడుతామని చెప్పి హామీ ఇవ్వటంతో ఇంటికి వెళ్ళిపోయాడు.
ఇటీవల హయత్ నగర్ లో విజయారెడ్డి హత్య పై పెట్రొల్ దాడి జరిగిన తరువాత రోజు రోజుకు ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి.

0 Comments